జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ | జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.

కరీంనగర్ : జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక ఇవ్వాలన్నారు.
నిధులు మంజూరు చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రామాల్లో కావాల్సిన కమ్యూనిటీ హాల్స్, మహిళా సమైక్య భవనాలకు సంబంధించిన నివేదికలు కూడా ఇవ్వాలన్నారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో కొత్తగా రేషన్ కార్డ్ లు 623 మందికి మంజూరు అయ్యాయని తెలిపారు.
అలాగే 237 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా మంజూరు అయ్యాయని మూడు రోజుల్లో లబ్దిదారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజి రెడ్డి, ఇంచార్జి ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, రైతు జిల్లా సమన్వయ కమిటీ డైరెక్టర్ లింగా రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

