Home
Telangana
The National Investigation Agency Nia Filed A Charge Sheet Against Three Others In Connection With The Seizure Of Drones And Explosives In Bhadradri Kothagudem District In Charla In August
చర్ల ఘటనలో మరో ముగ్గురిపై చార్జీషీటు
మావోయిస్టు సానుభూతి పరుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిరుడు ఆగస్టులో డ్రోన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్న కేసులో మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం చార్జీషీటు దాఖలు చేసింది.
హైదరాబాద్, మే 7(నమస్తే తెలంగాణ): మావోయిస్టు సానుభూతి పరుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిరుడు ఆగస్టులో డ్రోన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్న కేసులో మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం చార్జీషీటు దాఖలు చేసింది. గతంలో ఇదే కేసులో ఎనిమిది మందిపై చార్జీషీట్ ఫైల్ అయ్యింది.
భద్రతా బలగాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లు, అడ్డుకొనేందుకు ఆయుధాలు సప్లయ్ చేస్తన్నారని కమల, పరారీలో ఉన్న హిడ్మా, బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌పై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. వారిపై ఐపీసీ సెక్షన్ 120 బీ, యూఏ(పీ) చట్టంలోని 17, 18, 20, 38, 39, 40 సెక్షన్ల కింద, పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 4 కింద చార్జీషీట్ దాఖలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

