గోండి రక్షణకు తెలంగాణ చర్యలు భేష్

కేంద్ర మంత్రి రేణుకాసింగ్
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం గోండి భాష పరిరరక్షణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ప్రశంసించారు. కోయ, గోండి, కొలామ్, లంబాడా భాషల రక్షణ, అభివృద్ధికిపై సోమవారం లోకసభలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. యునెస్కో గుర్తించిన అంతరించిపోతున్న భాషల్లో గోండి ఒకటని, దాని పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుం గలో తొక్కి రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చి తీరా అక్కడి గనుల్లో నాణ్యత లేదనటం పరిశ్రమను ఎత్తివేసేందుకు సాకు చెప్పటమేనని మండిపడ్డారు. కేంద్రం జవహర్ నవోదయ విద్యాలయాలను (జెన్వీ) కొన్నిరాష్ర్టాలకే కేటాయిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని టీఆర్ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. రాష్ట్ర కాలుష్య మండలికి నిధులు పెంచాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

