మాస్క్‌తో మరణాలు తగ్గించొచ్చు
- 87 శాతం బయటపడొచ్చని సీడీసీ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మాస్కులు విధిగా ధరించడం వల్ల కరోనాను కట్టడి చేయడంతోపాటు, ప్రస్తుతం వైరస్ ద్వారా సంభవిస్తున్న మరణాల రేటును నుంచి 87 శాతం తగ్గించవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో వెల్లడైంది. సీడీసీకి చెందిన పరిశోధకుల బృందం, నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ యూఎస్ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. డబుల్ మాస్కులు ధరించడం వల్ల యూకే వైరస్ వేరియంట్ బారినపడకుండా కాపాడుకోవచ్చని పేర్కొన్నాయి. ఆర్నెళ్లపాటు మాస్క్ వినియోగం- ప్రయోజనాలు అంశంపై యూఎస్‌లో జరిగిన అధ్యయనంలో విషయాలు వెల్లడయ్యాయి.
కేవలం క్లాత్ మాస్క్ వినియోగించడం వల్లనే మరణాల శాతం 82 శాతం తగ్గినట్టు అధ్యయనం స్పష్టంచేసింది. వైరస్వ్యాప్తి చెందకుండా మెడికల్ మాస్కులు 78 శాతం, క్లాత్ మాస్కులు 69 శాతం అడ్డుకుంటాయని పేర్కొన్నది. ఒకరి నుంచి ఆరుగురికి వ్యాప్తి చేందేంతగా వైరస్ మ్యుటేషన్ పొందిందని, దీని వ్యాప్తిని అడ్డుకోవడంలో డబుల్ మాస్కుల వినియోగం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. ఇన్ఫెక్షన్ సోకినవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఇలాంటి చర్య వల్ల ఒక్కరికి మాత్రమే వైరస్ పరిమితమవుతుందని సూచించింది. సెకండ్‌వేవ్‌లో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని, అలాంటివారికి కొవిడ్ వచ్చిన విషయం కూడా తెలియడం లేదని పేర్కొన్నది. అందుకే పాజిటివ్ ఉన్నా లేకున్నా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ గొలుసును తెంపవచ్చని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Covid mask
- mask
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

