22-35 ఏండ్లవారి మధ్యే పోటీ!
- పోలీస్ ఉద్యోగార్థుల్లో ఈ వయస్కులే ఎక్కువ
- వయో పరిమితి పెంపుతో శ్రమిస్తున్న అభ్యర్థులు
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లో భర్తీ చేయనున్న యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారిలో 22 నుంచి 35 ఏండ్ల వయసు అభ్యర్థులే ఎక్కువ ఉన్నారు. వాస్తవానికి గతంలో ఓపెన్ క్యాటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు గరిష్ఠ వయోపరిమితి 22 ఏండ్లు, ఎస్సై ఉద్యోగానికి 25 ఏండ్లుగా ఉండేది. కానీ, ఉద్యోగార్థుల విన్నపం మేరకు సీఎం కేసీఆర్ మావనతా ధృక్పథంలో స్పందించి ఈ పరిమితిని రెండు దఫాలుగా పెంచారు. మొత్తంగా ఐదేండ్ల వెసులుబాటు కల్పించారు. ఇది లక్షలాది మంది పోలీస్ ఉద్యోగార్థుల ఆశలకు ఊపిరి పోసింది.
ఎస్సై ఉద్యోగార్థుల్లో 25-30 ఏండ్ల వారే అధికం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఓపెన్ క్యాటగిరీ ఎస్సై ఉద్యోగార్థుల వయో పరిమితి 30 ఏండ్లకు పెరిగింది. రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులకు అదనంగా మరో ఐదేండ్లు వెసులుబాటు లభించింది. ఇది ఎంతో మంది ఆశావహులకు గొప్ప వరంలా మారింది. సివిల్ ఎస్సై ఉద్యోగానికి పోటీపడుతున్న అభ్యర్థుల్లో 21-25 ఏండ్లవారి నుంచి 88,497 దరఖాస్తులు, 26-30 ఏండ్లవారి నుంచి 10,8077 దరఖాస్తులు, 30 ఏండ్ల వయసు మించినవారి నుంచి 47,501 దరఖాస్తులు అందాయి.
ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్సై ఉద్యోగానికి 21-25 ఏండ్లవారి నుంచి 4,398 దరఖాస్తులు, 26-30 ఏండ్లవారి నుంచి 6,831 దరఖాస్తులు, 30 ఏండ్ల వయసు మించినవారి నుంచి 3,166 దరఖాస్తులు వచ్చాయి.
పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో ఎస్సై ఉద్యోగానికి 21-25 ఏండ్లవారి నుంచి 1,123 దరఖాస్తులు, 26-30 ఏండ్లవారి నుంచి 1,715 దరఖాస్తులు, 30 ఏండ్ల వయసు మించినవారి నుంచి 658 దరఖాస్తులు అందాయి.
ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్సై ఉద్యోగానికి 21-25 ఏండ్లవారి నుంచి 1,663 దరఖాస్తులు, 26-30 ఏండ్లవారి నుంచి 2,754 దరఖాస్తులు వచ్చాయి.
కానిస్టేబుల్ ఉద్యోగాలకూ పెరిగిన పోటీ
కానిస్టేబుల్ ఉద్యోగాలకూ పోటీ పెరిగింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-22 ఏండ్లలోపు (గతంలో ఇదే అర్హత వయస్సు) వారి నుంచి 2,35,165 దరఖాస్తులు, 23-27 ఏండ్లవారి నుంచి 2,66,327 దరఖాస్తులు, 28-33 ఏండ్లవారి నుంచి 1,41,747 దరఖాస్తులు వచ్చాయి.
- ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-22 ఏండ్లవారి నుంచి 74,923 దరఖాస్తులు, 23-27 ఏండ్లవారి నుంచి 1,16,869 దరఖాస్తులు, 28-33 ఏండ్లవారి నుంచి 74,128 దరఖాస్తులు అందాయి.
- రవాణా శాఖలోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-22 ఏండ్లవారి నుంచి 8,388 దరఖాస్తులు, 23-27 ఏండ్లవారి నుంచి 19,869 దరఖాస్తులు, 28 ఏండ్ల వయసు దాటినవారి నుంచి 16,639 దరఖాస్తులు వచ్చాయి.
- ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-22 ఏండ్లవారి నుంచి 3,655, 23-27 ఏండ్లవారి నుంచి 10,263 దరఖాస్తులు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

