కొల్లాపూర్/చిన్నంబావి, జూలై 14 : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన పెద్దదగడలో తిరుగుబాటు మొదలైందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన జూపల్లి వర్గీయులు శుక్రవారం ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఉపసర్పంచ్ చిన్నకొండయ్య, వార్డు సభ్యులు బాలకృష్ణ, మైబూస్, నాయకులు నాగరాజు, ముని, మంగలిరాజుతోపాటు పలువురు గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దదగడలో జూపల్లిపై తిరుగుబాటు మొదలైందని అన్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నట్టు తెలిపారు.