శిగమూగిన సిరిసిల్ల.. సిద్దిపేట ధూంధాం
ఉద్యమ ఖిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట శిగమూగాయి. కేసీఆర్ రాకతో సందడి చేశాయి. జన ప్రభంజనం వెల్లువలా కదిలివచ్చింది. బస్సుయాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది.
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- ఆఖరిరోజునా రోడ్‌షోలకు జన నీరాజనం
- డప్పుచప్పుళ్లు, బోనాలు, హారతులతో ఘనస్వాగతం
- అడుగడుగునా జననేతకు బ్రహ్మరథంపట్టిన ప్రజలు
- కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టిన కేసీఆర్
కరీంనగర్/సిద్దిపేట,బోయినపల్లి, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ): ఉద్యమ ఖిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట శిగమూగాయి. కేసీఆర్ రాకతో సందడి చేశాయి. జన ప్రభంజనం వెల్లువలా కదిలివచ్చింది. బస్సుయాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. రోడ్‌షోలలో జనం నీరాజనం పలికారు. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర ఆఖరిరోజైన శుక్రవారం విజయవంతంగా ముగిసింది. రెండు పట్టణాల్లో దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ రాకతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, కోలాటాలతో జననేతకు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి సిరిసిల్లకు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.
ఈ సమయంలో దారి పొడవునా ప్రజలు అపూర్వ స్వాగతం తెలిపారు. సిరిసిల్లలోని కొత్త చెరువు వద్ద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, వేములవాడ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలిపారు. నేతన్నచౌక్ వద్ద జరిగిన సభకు కేసీఆర్ చేరుకోగానే జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మిన్నంటాయి. కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపు అవశ్యకతను కేసీఆర్ నొక్కి చెప్పారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
సిరిసిల్ల జిల్లా ఉండాలంటే వినోద్ గెలవాలి
సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తామంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఉండాలా? పోవాలా? సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఇక్కడ వినోద్‌కుమార్ గెలవాలి.. అని కేసీఆర్ చెప్పారు. వినోద్‌కుమార్‌తో బండి సంజయ్‌ను పోల్చిన కేసీఆర్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ కేసీఆర్ విజప్తి చేసినప్పడు.. సభ మొత్తం పిడికిళ్లెత్తి సంఘీభావాన్ని ప్రకటించింది.
మిర్చీలు తింటూ.. ప్రజలతో ముచ్చటిస్తూ..
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తూ బోయినపల్లి మండలం వెంకట్రావ్పల్లిలోని రాజయ్య హోటల్ వద్ద కేసీఆర్ ఆగారు. హోటల్లో మిర్చీలు తిని టీ తాగారు. ఈ సందర్భంగా అభిమానులు కేసీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. తర్వాత కేసీఆర్ అత్తగారి ఊరైన కొదురుపాకలో మహిళలు పూలుచల్లి స్వాగతం పలికారు. కొదురుపాక చెక్‌పోస్టు వద్ద పోలీసులు కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు.
సిద్దిపేట మట్టి బిడ్డకు అపూర్వస్వాగతం
సిద్దిపేట మట్టిబిడ్డ తెలంగాణ ప్రధాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం పలికారు. మోడల్ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్‌షోకు జన సందోహం పోటెత్తింది. సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాకు చేరుకున్న కేసీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికారు. మోడల్ బస్టాండ్ వద్ద క్రేన్ సాయంతో కేసీఆర్‌కు భారీ గజమాలను వేశారు. గొల్లకుర్మలు అందించిన గొంగడిని కేసీఆర్ కప్పుకున్నారు. అభిమానులు గద ను బహుకరించారు. సిద్దిపేట జిల్లా కోసం యుద్ధం చేద్దామంటూ కేసీఆర్ అనగానే.. ప్రజ ల నుంచి విశేష స్పందన వచ్చింది. నా ఆత్మీ య అన్నదమ్ములకు, సిద్దిపేట ప్రజలకు, నా పురిటిగడ్డకు వందనం అని అనగానే.. పెద్దపెట్టున ప్రజలు జై కేసీఆర్ అంటూ నినదించారు. కేసీఆర్ పలుమార్లు లక్ష మెజారిటీ రావాలన్నపుడు ‘పక్కా’ అంటూ ప్రతిస్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

