కారుణ్య నియామక దరఖాస్తు గడువు ఏడాదే.. ఆ తర్వాత చేస్తే చెల్లదు: హైకోర్టు
కారుణ్య నియామకాలకు ఏడాదిలోగా దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగ నియామకానికి అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కారుణ్య నియామకాలకు ఏడాదిలోగా దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగ నియామకానికి అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 887 ప్రకారం ఏడాదిలోగానే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఏడాది తర్వాత దరఖాస్తు చేసుకుంటే కారుణ్య నియామకానికి ఆదేశాలు ఇవ్వబోమని తీర్పు చెప్పింది. రాష్ట్ర ఉద్యాన వర్సిటీలో పనిచేస్తున్న తన భర్త 2011 ఏప్రిల్ 2న మరణించడంతో కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని మహబూబాబాద్‌కు చెందిన కే భాగ్యలక్ష్మి 2013 మార్చిలో దరఖాస్తు చేసుకున్నారు.
జీవో నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాది తర్వాత చేసుకున్న ఆ దరఖాస్తును విశ్వవిద్యాలయం తిరసరించింది. దీనిపై భాగ్యలక్ష్మి హైకోర్టును ఆశ్రయించడంతో కారుణ్య నియామకం కింద ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని 2025లో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వర్సిటీ దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు జీవో 887కి వ్యతిరేకంగా ఉన్నట్టు తేల్చింది. భర్త మరణించిన ఏడాదిలోగానే కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని, లేనిపక్షంలో కారుణ్య నియామకానికి అనర్హులని తీర్పు చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

