ఆ వైద్యానికి పెరుగుతున్న ఆదరణ..దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిది : మంత్రి సత్యవతి
sathyavathi rathod | అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశస్త్యం మరింత పెరిగిందన్నారు.

హైదరాబాద్ : శాస్త్ర,సాంకేతిక రంగాలు ఎంతో వృద్ధి చెందినా అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశస్త్యం మరింత పెరిగిందన్నారు.
ఇలాంటి వైద్యాన్ని తగిన రీతిలో గుర్తించి, భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలన్నారు. ఆదివాసీ సంప్రదాయక వైద్యరీతులపై బుధవారం ఆన్ లైన్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జాతీయ వర్క్ షాప్‌లో మంత్రి సత్యవతి పాల్గొని ప్రసంగించారు.
ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా జరిగే వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉండవని, అందుకే దీనికి ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతుందన్నారు. అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రకృతి వైద్యం పొందడం వల్ల మంచి జీవన ప్రమాణాలతో వందేళ్లకు పైగా జీవించారన్నారు.
ఈ ఆహార విధానాన్ని, వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం దీనిపై మరింత పరిశోధన చేయాలన్నారు. స్థానిక యువతకు అవగాహన కల్పించి సంరక్షించాలన్నారు. కొత్త, కొత్త రోగాలు, జబ్బులు వస్తున్న నేపథ్యంలో ఆ ఆదివాసీ,గిరిజన వైద్యం ద్వారా పరిష్కారం వస్తుందా? అనేది పరిశీలించాలన్నారు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు. సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అధికారులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

