హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): బీసీ జాబితాలోని పలు కులాల కు చెందిన పేర్లలో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దొమ్మర కులం పేరును గడ వంశీయగా, బుడబుక్కల కులాని కి మారుపేరుగా శివ క్షత్రీయగా, చిప్పో లు కులాన్ని మేరుగా, వీరముష్టి కులం పేరును వీరభద్రీయ కులంగా మార్చింది.
వంశరాజ్ పిచ్చగుంట్ల కులం పేరు నుంచి పిచ్చగుంట్ల పదాన్ని, తమ్మలి నుంచి శూద్ర క్యాస్ట్ను తొలగిస్తూ, చాకలి (రజక/వన్నార్) కులం పేరులో నుంచి వన్నార్ పదాన్ని తొలగించి, ధోబీ పదాన్ని చేర్చింది.