Staff nurse recruitment | టీచింగ్ దవాఖానల్లో కొత్తగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టులు.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టనున్న ఎంహెచ్ఆర్బీ
రాష్ట్రంలో మరో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని టీచిం గ్ దవాఖానల్లో వీటిని భర్తీ చేయనున్నారు.
- టీచింగ్ దవాఖానల్లో భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్
- త్వరలో సిద్ధంకానున్న 8 వైద్యకళాశాలల కోసం
- ఇప్పటికే కొనసాగుతున్న 5,204 పోస్టుల భర్తీ
Staff nurse recruitment | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని టీచిం గ్ దవాఖానల్లో వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నది. ఇప్పటికే 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరికి ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో అత్యధిక శాతం డీఎంఈ పరిధిలోనే ఉన్నా యి. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నదని చెప్పారు.
పేదలకు స్పెషాలిటీ సేవలు చేరువ చేసే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని వేగంగా చేరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26 కు చేరిందని తెలిపారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

