గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
గిరిజన భూముల పరిరక్షణతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పెసా చట్టం కింద గిరిజనుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని పలువురు న్యాయనిపుణులు, గిరిజన హకుల కార్యకర్తలు కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): గిరిజన భూముల పరిరక్షణతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పెసా చట్టం కింద గిరిజనుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని పలువురు న్యాయనిపుణులు, గిరిజన హకుల కార్యకర్తలు కోరారు. గిరిజన భూములకు సంబంధించిన సమస్యల పరిషారానికి గిర్గ్లానీ కమిషన్ నివేదికను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజనుల రాజ్యాంగ హకుల పరిరక్షణపై మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘సెస్’ డైరెక్టర్ డాక్టర్ రేవతి మాట్లాడుతూ.. తెలంగాణలో గిరిజన భూముల అన్యాక్రాంతం, వారి జీవనోపాధి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సమస్యల పరిషారానికి నిర్ధిష్ట చర్యలు అవసరమని పేర్కొన్నారు. 1959 నాటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం, 1970లో చేసిన సవరణల ప్రాధాన్యాన్ని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవోను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తలెత్తిన పరిణామాలను న్యాయవాది, గిరిజన హకుల కార్యకర్త డాక్టర్ పల్లా త్రినాథరావు వివరించారు.
గిరిజనుల రాజకీయ ప్రాతినిధ్యం, స్వపరిపాలన హకులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయంతో కృషిచేయాలని, బలమైన న్యాయ వైఖరిని అవలంబించాలని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ షైన్ శశిధర్ కోరారు. ఈ సమావేశంలో వెలువడిన అభిప్రాయాలను కార్యాచరణ ప్రతిపాదనలుగా రూపొందించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమర్పించాలని ఏకలవ్య ఫౌండేషన్‌కు చెందిన పీ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

