రాష్ట్ర ఓటర్లు 3 కోట్లు.. హైదరాబాద్‌లో అత్యధికం, ములుగులో అత్యల్పం
రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రం లో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718 మంది, పురు ష ఓటర్లు 1,50,48,250 మంది ఉన్నట్టు ఈసీ పేర్కొన్నది.
- తుది జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం
- మహిళలు 1.49 కోట్లు, పురుషులు 1.50 కోట్లు
- 18-19 వయసున్న యువ ఓటర్లు 2.78 లక్షలు
- ఓటర్ల జాబితా తయారీలో పూర్తి పారదర్శకత: ఈసీ
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రం లో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718 మంది, పురు ష ఓటర్లు 1,50,48,250 మంది ఉన్నట్టు ఈసీ పేర్కొన్నది. యువ ఓటర్లు (18-19 ఏండ్ల వయస్కులు) 2,78,650 మంది ఉన్నట్టు తెలిపింది. జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 42,15,456 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,08,176 ఓటర్లు ఉన్నారు. రెండో స్థానంలో రంగారెడ్డి (31,08,068) మూడో స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి (25,24,951) ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 6,44,072 మంది, అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,42,813 మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది నవంబర్ నాటికి 2,95,65,669 మంది ఓటర్లతో ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించింది. 6,84,408 మంది ఓటర్లను కొత్తగా చేర్చి, 2,72,418 ఓట్లను తొలగించి తుది జాబితాను విడుదల చేసింది.
పారదర్శకంగా ఓటర్ల జాబితా: సీఈవో
ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి, అన్ని వర్గాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశామని వెల్లడించారు. 18-19 ఏండ్ల వయస్కులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లుగా నమోదు చేయించామని వివరించారు. 361 గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 2,800 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించామని చెప్పారు. 312 మంది ట్రాన్స్జెండర్లను కూడా కొత్తగా ఓటర్లుగా చేర్చామని పేర్కొన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ceo
- Women Voters
- Young voters
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

