ఫోన్ ట్యాపింగ్ కేసులో.. చార్జిషీట్ తిప్పి పంపిన కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
నాంపల్లి కోర్టులు, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. సాక్ష్యాధారాలు, కీలక పత్రాలకు సంబంధించిన వివరాలను చార్జిషీట్లో పొందుపర్చినప్పటికీ వాటిని కోర్టుకు సమర్పించలేదని గుర్తుచేసింది. పూర్తి సమాచారంతో చార్జిషీటును దాఖలు చేయాలని, తప్పులను సవరించి ఆధారాలకు సంబంధించిన జాబితా ప్రకారం వస్తువులను, పత్రాలను కోర్టుకు అందించాలని సూచించింది.
ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్‌కుమార్ విదేశాలనుంచి రాగానే వారినుంచి సేకరించాల్సిన సమాచారాన్ని జోడించి చార్జిషీట్‌ను దాఖలు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన వస్తువులు, కంప్యూటర్లకు చెందిన డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, పత్రాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఎస్ఐబీ మాజీ అధికారి ప్రణీత్‌రావుకు చెందిన లాప్‌టాప్‌ను జప్తు చేసినట్టు అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నప్పటికీ దానిని కోర్టుకు సమర్పించలేదు. రాజకీయ నాయకుల పేర్లను సైతం ప్రస్తుత చార్జిషీటులో చేర్చలేదని సమాచారం. సరైన సమయంలో అందరి పేర్లతోపాటు వారికి సంబంధించిన సాక్ష్యాధారాలను జతచేసి చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

