చెన్నూర్ టౌన్, అక్టోబర్ 5: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌కే మద్దతు తెలుపుతున్నామని బార్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కోర్టు సముదాయంలో నిర్వహించిన సమావేశంలో వారు ఏకగ్రీవ తీర్మానం చేసి.. బాల్క సుమన్‌కు తీర్మాన కాపీని అందజేశారు.
చెన్నూర్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి యజ్ఞంలో అందరూ భాగస్వాములవ్వాలని విప్ న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్, చెన్నూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.