సకల తెలంగాణ సమ్మోహనం.. టీఆర్ఎస్
: ఆధునిక తెలంగాణ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పుట్టుక ఒక కీలక మలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదురైన అన్యాయాలు, అవమానాల నుంచి బయటపడేందుకు తెలంగాణ సమాజం చేసిన అలుపెరుగని పోరాటానికి సంపూ ర్ణ రూపునిచ్చిన రాజకీయ వేదిక.
- తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖరారైన తేదీ జూలై 1, 2000
- జలదృశ్యంలో కేసీఆర్ వెల్లడించిన తేదీ 27 ఏప్రిల్, 2001
- తెలంగాణ గడ్డపై చిరస్థాయిగా వెలిగే అఖండ దివిటీలా సృష్టి
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఆధునిక తెలంగాణ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పుట్టుక ఒక కీలక మలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదురైన అన్యాయాలు, అవమానాల నుంచి బయటపడేందుకు తెలంగాణ సమాజం చేసిన అలుపెరుగని పోరాటానికి సంపూ ర్ణ రూపునిచ్చిన రాజకీయ వేదిక. అంతకుముందు అనేక పార్టీలు, సంస్థలు వచ్చినా ఉద్యమ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నేతల స్వార్థం, వ్యక్తిగత ఆకాంక్షలు, రాజకీయ వ్యూహాల్లో లోపంతో లక్ష్యసాధనలో విఫలమయ్యాయి. వాటికి భిన్నంగా ఉద్యమానికి వెలుగునిచ్చి నిటారైన మహా దీప స్తంభంలా నిలబడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్.
ఆ వ్యూహానికి తిరుగులేదు
గత అనుభవాల దృష్ట్యా ఉద్యమంలోకి దిగటానికి ముందే కేసీఆర్ తెలంగాణ సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులపై లోతైన అధ్యయనం చేశారు. ఉద్యమ వైఫల్యాలకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాతే దృఢ చిత్తంతో తిరుగులేని రాజకీయ వ్యూహాన్ని మదిలో రూపొందించుకొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పంథాను వదలొద్దని, రాజకీయ వ్యూహాల ద్వారానే లక్ష్యం చేరగలమని నమ్మి ఆచరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా పురోగమించాలన్న లక్ష్యాలు కూడా మొదటే రూపొందించుకొన్నారని అంటారు. పార్టీ పేరు ప్రకటనపై కూడా కేసీఆర్ లోతైన అధ్యయన మే చేశారని ఆయన సన్నిహితులు చెప్తారు. అప్పటికే తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజాపార్టీ, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ స్టూడెంట్ యూనియన్, తెలంగాణ స్టూడెంట్ ఫోరం, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం.. ఇలా అనేక రాజకీయ సంస్థలున్నాయి. దీంతో ఒక వర్గానికో, సమూహానికో కాకుండా తెలంగాణ మొత్తాన్ని ప్రతిబింబించేలా పేరు ఉండాలని, అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని భావించారు. ఈ క్రమంలో కొందరు ఉద్యమ సమితి, పోరాట సమితి.. అని రకరకాల పేర్లు సూచించినా చివరకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ఖరారు చేశారు కేసీఆర్.
10 నెలల ముందే నిర్ణయం
పార్టీ ప్రకటనకు 10 నెలల ముందే కేసీఆర్ పేరు ఖరారు చేశారని చెప్తారు. ప్రత్యేక రాష్ర్టానికి, ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉండేలా జూలై 1, 2000న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఏప్రిల్ 27, 2001న హైదరాబాద్లోని జలదృశ్యంలో పార్టీ పేరును కేసీఆర్ లాంఛనంగా ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- TRS
- TRS Formation Day
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

