హైదరాబాద్‌లో ఇక నో ట్రా’ఫికర్’.. అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థతో ముందుకొచ్చిన జీహెచ్ఎంసీ
రాష్ట్ర రాజధానిలోని జంక్షన్లలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్‌ను మార్చే కొత్త అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ఏటీఎస్సీ) వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్ర రాజధానిలోని జంక్షన్లలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్‌ను మార్చే కొత్త అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ఏటీఎస్సీ) వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఏటీఎస్సీని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) అభివృద్ధి చేసింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడాప్టివ్ కంట్రోల్ అల్గోరిథం ద్వారా పనిచేసే ఈ వ్యవస్థను కాంపోజిట్ సిగ్నల్ కంట్రోల్ స్ట్రాటజీ అని పిలుస్తారు. ఇది రియల్ టైం ఆధారంగా పనిచేస్తుంది. ఇది సాధారణ ట్రాఫిక్ సిగ్నల్ల మాదిరిగా కాకుండా, మారుతున్న వాహనాల రాకపోకల ఆధారంగా స్వయంచాలకంగా గ్రీన్ లైట్‌ను నిరంతరంగా సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల తక్కువ వాహనాలున్నా ఎక్కువసేపు ఆగే అవసరం ఉండదు.
ప్రస్తుతం..ఏటీఎస్సీ, పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ (పీఎస్ఎస్) ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో 122 ఏటీఎస్సీ సిగ్నల్స్, 94 పెలికాన్ సిగ్నల్స్, 213 హెచ్టీఆర్ఐఎంఎస్ సిగ్నల్స్ హైదరాబాద్ అంతటా ఉన్నాయి. 57 ఏటీఎస్సీ సిగ్నల్స్, ఇప్పటికే ఉన్న 157 హెచ్టీఆర్ఐఎంఎస్ సిగ్నల్‌లతో కూడిన 57 కారిడార్ల ప్రాజెక్ట్ స్కోప్లోని ప్రధాన భాగం పూర్తయింది. కొత్త వ్యవస్థలో భాగంగా నగరంలో విస్తృత ప్రయోజనాలను అందజేయాలని జీఎహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
నగరంలోని ప్రధాన కారిడార్లలో ఏటీఎస్సీ వ్యవస్థతో ట్రాఫిక్ మెరుగుపడనుంది. పుష్-బటన్ సౌకర్యంతో కూడిన 94 పెలికాన్ సిగ్నల్స్ పాదాచారులు సురక్షితంగా రోడ్‌క్రాస్ చేసేలా సహాయపడుతాయి. ఈ సిగ్నల్స్‌ను ఎక్కువగా దవాఖానలు, కళాశాలలు/పాఠశాలలు, పాదచారులు ఎక్కువగా ఉండే వాణిజ్య బహిరంగ ప్రదేశాల్లో అమర్చారు.
ప్రాజెక్ట్ కీ ఫీచర్లు..
• కారిడార్ ట్రాఫిక్ సిగ్నల్స్‌పై కేంద్ర నియంత్రణ
• మారుతున్న ట్రాఫిక్ నమూనాల ఆధారంగా సిగ్నల్ టైమింగ్స్
• కెమెరా ఆధారిత ట్రాఫిక్ సెన్సార్లు
• సౌర, బ్యాటరీల ద్వారా పవర్ బ్యాకప్
ప్రాజెక్ట్ ప్రయోజనాలు
• ప్రయాణ సమయ విశ్వసనీయతను మెరుగుపరచడం
• జంక్షన్లలో తక్కువ వేచి ఉండేలా చూడడం..
• నగరవ్యాప్తంగా రద్దీ తగ్గింపు
• తక్కువ స్టాప్‌లు, తక్కువ ఉద్గారాలు
• మెరుగైన రహదారి భద్రత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

