‘మనుసున్న మారాజు కేటీఆర్ అన్న’
తన చదువుకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అనాథ యువతి రుద్ర రచన విభిన్నంగా ధన్యవాదాలు తెలిపింది. ‘మనసున్న మారాజు కేటీఆర్ అన్న’ అనే పాట రాసి కృతజ్ఞత చాటుకున్నది. శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసింది.
- చదువుకు బాసటగా నిలిచినందుకు రామన్నకు పాటతో రుద్ర రచన కృతజ్ఞతలు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తన చదువుకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అనాథ యువతి రుద్ర రచన విభిన్నంగా ధన్యవాదాలు తెలిపింది. ‘మనసున్న మారాజు కేటీఆర్ అన్న’ అనే పాట రాసి కృతజ్ఞత చాటుకున్నది. శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా తాను రాసిన పాటను కేటీఆర్ ఆవిష్కరించగా ఆనందంతో ఉప్పొంగిపోయింది. అభిమాన నేతకు రాఖీ కట్టి మురిసిపోయింది.
తల్లిదండ్రులను కోల్పోయి దీనస్థితిలో ఉన్న తనను కేటీఆర్ చేరదీశారని పేర్కొన్నది. తోడబుట్టిన సోదరుడిలా ఇంజినీరింగ్ చదువుకు అవసరమైన ఫీజులు, హాస్టల్ ఖర్చులను భరించారని గుర్తుచేసుకున్నది. కేటీఆర్ ఇచ్చిన ఆర్థిక భరోసాతో విజయవంతంగా ఇంజినీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ఐటీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయని సంతోషంతో వెల్లడించింది. కేటీఆర్ చేసిన సహాయానికి గుర్తుగా పాట రాసినట్లు చెప్పింది. తన చదువుకు బాసటగా నిలిచి జీవితానికి దారిచూపిన రామన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా రచనను కేటీఆర్ అభినందించారు. భవిష్యత్‌లో ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రదించాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

