హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయని సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు https://tgrjc.cgg.gov. in వెబ్సైట్ను సంప్రదించి మెరిట్కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.