Group 2 | గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Group 2 | తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
Group 2 | తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
పేపర్ 1( జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) పరీక్షను డిసెంబర్ 15వ తేదీ మొదటి సెషన్లో, పేపర్ 2 ( హిస్టరీ, పాలిటీ, సొసైటీ) పరీక్షను రెండో సెషన్లో నిర్వహించనున్నారు. పేపర్ 3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) పరీక్షను 16వ తేదీ మొదటి సెషన్లో, పేపర్ 4 ( తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ) రెండో సెషన్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
నిజానికి ఆగస్టు 7, 8వ తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వారి డిమాండ్‌కు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. తాజాగా ఇప్పుడు పరీక్ష షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్2 పరీక్ష జరగనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!


