వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు
‘కరెంట్ కోతలకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులే దీనికి కారణం. అవసరమైతే ఐఏఎస్ అధికారులనైనా సస్పెండ్ చేస్తాం’ అని విద్యుత్తు సరఫరాపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వం తప్పేమీ లేదు.. అధికారులదే తప్పు అనేలా చేసిన ఆ వ్యాఖ్యలకు తొలుత వైటీపీఎస్ స్టేజ్-1 సీఈ బీ సురేశ్నాయక్పై జెన్కో సంస్థ సస్పెన్షన్ వేటువేయడం కలకలం రేపింది.
- విధుల్లో నిర్లక్ష్యమే కారణమన్న సీఎండీ
- పర్యవేక్షణాధికారులుగా ఐదుగురు ఐఏఎస్‌లు
- సమీక్షలో అధికారులపై చర్యలుంటాయని సీఎం అనగానే సీఈ సురేశ్‌కుమార్ సస్పెన్షన్
- సస్పెన్షన్ రద్దు కోరుతున్న ఉద్యోగుల జేఏసీ
- విధులు సమర్థవంతంగా నిర్వహించారని వినతి
నల్లగొండ ప్రతినిధి/దామరచర్ల, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): ‘కరెంట్ కోతలకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులే దీనికి కారణం. అవసరమైతే ఐఏఎస్ అధికారులనైనా సస్పెండ్ చేస్తాం’ అని విద్యుత్తు సరఫరాపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వం తప్పేమీ లేదు.. అధికారులదే తప్పు అనేలా చేసిన ఆ వ్యాఖ్యలకు తొలుత వైటీపీఎస్ స్టేజ్-1 సీఈ బీ సురేశ్నాయక్పై జెన్కో సంస్థ సస్పెన్షన్ వేటువేయడం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా పరిధిలోని వైటీపీఎస్నే కేంద్రంగా ఎంచుకుని 2 నెలల క్రితమే ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ అధికారి సీఈ సురేశ్నాయక్పై అకస్మాత్తుగా చర్యలు తీసుకోవడంపై సంస్థ ఉద్యోగులు రగిలిపోతున్నారు.
ఇదే సమయంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉండగా, సీఈ సురేశ్‌నాయక్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ వైటీపీఎస్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జెన్కో సీఎండీ హరీశ్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా యాదాద్రి పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్) స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ (సీఈ) బీ సురేష్‌నాయక్‌ను ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు టీజీ జెన్కో సీఎండీ హరీశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి స్టేజ్-1లో 800 మెగావాట్ల యూనిట్‌ను 2 వారాలుగా షట్‌డౌన్ చేయడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం, సిబ్బందితో సమన్వయం లేక, సమీక్షలు నిర్వహించక, పెండింగ్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. గత నెలలోనూ ఆయిల్ స్టాక్ నిర్వహణలో లోపాల కారణంగా డీఈ ఎల్డీవోపై సంస్థ వేటు వేశారు.
సీఈ సస్పెన్షన్ రద్దు చేయాలి: జేఏసీ
వైటీపీఎస్ స్టేజీ-1 సీఈ సురేశ్‌నాయక్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ వైటీపీఎస్ ఉద్యోగుల జేఏసీ గురువారం సీఎండీ హరీశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. సీఈ సురేశ్‌నాయక్ వచ్చిన ఈ నాలుగు నెలల్లో పెండింగ్‌లో ఉన్న అనేక పనులు, డిజైన్ లోపాలు, సాంకేతిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి చొరవ చూపారని జేఏసీ నేతలు గుర్తుచేశారు. ఈ కొద్దికాలంలోనే టీజీజెన్కో సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, కోల్‌హ్యాండ్లింగ్ పూర్తి నిర్ణీత సామర్థ్యాన్ని పునరుద్ధరించేలా నిరంతరం కృషి చేస్తున్నారని, ఇతర సమస్యల పరిష్కారనికి కృషి చేస్తున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు సస్పెన్షన్‌ను పునఃపరిశీలించి రద్దు నిర్ణయాన్ని త్వరలో ప్రకటించాలని వారు కోరారు.
పర్యవేక్షణాధికారులుగా ఐదుగురు
యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో ఐదుగురు ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వారికి తేదీల వారీగా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ గురువారం (15) నుంచి 17(శనివారం) వరకు, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే 18 నుంచి 19 వరకు, సహకార శాఖ, సహకార సంఘాల రిజిస్ట్రార్ ప్రత్యేక కమిషనర్ రాహుల్‌రాజ్ ఈనెల 22 నుంచి 24 వరకు, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో జెండాగే హనుమంతు కొండిబా ఈ నెల 25 నుంచి 27 వరకు, ఆర్ఆర్, ఎల్ఏ, ఐఎఫ్ సీఏడీ కమీషనర్ కిల్లు శివకుమార్‌నాయుడు ఈ నెల 28 నుంచి 30 వరకు ప్లాంట్‌లో పనులను స్వయంగా పర్యవేక్షిస్తారు.
డైవర్షన్ డ్రామా: ఉద్యోగుల ఫైర్
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ కరెంటు కోతలు పెరుగుతుండటం, ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్‌కు తెరలేపిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో విద్యుదుత్పత్తిలో నిర్లక్ష్యానికి అధికారుల వైఫల్యంగా చిత్రీకరించేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న చర్చ మొదలైంది. గత నెల నుంచి సీఎండీ హరీశ్‌కుమార్ సంస్థలో పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ కూడా పలుమార్లు ప్లాంటును పరిశీలించారు. ఒడిశాలోని మహానది కోల్‌బెల్ట్ నుంచి బొగ్గు సరఫరాను పెంచినా ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు నెలకొంటూనే ఉన్నాయి. కన్వేయర్ బెల్ట్ సగం సామర్థ్యంతోనే పనిచేస్తుండటం వల్ల లోడ్ పెంచితే తెగిపోతుందని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

