Hyderabad Rains | రాగల 2 గంటల్లో హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ
Hyderabad Rains | రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇదిలా ఉంటే రాగల రెండు మూడు గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hyderabad Rains | రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇదిలా ఉంటే రాగల రెండు మూడు గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నల్గొండ, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటలకు 41 నుంచి 61 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్కర్నూలు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రేపు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

