TG Weather | వరంగల్కు ఐఎండీ వార్నింగ్.. మరో రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు
TG Weather | వరంగల్ జిల్లాలో రాగల రెండు గంటల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాలోకి ఒకటి రెండు చోట్ల గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.
TG Weather | వరంగల్ జిల్లాలో రాగల రెండు గంటల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాలోకి ఒకటి రెండు చోట్ల గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక రెండు మూడు గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం నాడు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం నాడు ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
బుధవారం నాడు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

