TG Polycet | పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూన్ 22వ తేదీ నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. వారికి జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు.
ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై 7వ తేదీన ప్రారంభించనున్నారు. జూలై 9న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. 13వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. జూలై 21వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం కల్పించారు. జూలై 24వ తేదీ లోపు అన్ని సీట్లను కేటాయించనున్నారు. జూలై 23 స్పాట్ ఆడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.