TG PGECET | హైదరాబాద్ : టీజీ పీజీఈసెట్ -2024 ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు రెండు సెషన్లలో ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. హైదరాబాద్లో, వరంగల్లో పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్లో 18300 మంది అభ్యర్థులకు గానూ 16538 మంది హాజరయ్యారు. వరంగల్లో 4412 మంది అభ్యర్థులకు గానూ 4088 మంది హాజరయ్యారు. మొత్తం 90.82 శాతం మంది హాజరైనట్లు కన్వీనర్ వెల్లడించారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మ్, ఎం ఆర్క్, గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.