Stray Dog | వీధికుక్కల నియంత్రణపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం..!
Stray Dog | వీధికుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఉదాశీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.
Stray Dog | వీధికుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఉదాశీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. పిల్లలతో పాటు జనాలపై కుక్కల దాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో గతంలోనూ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మరణాలకు కారణమవుతున్న వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని.. వ్యాక్సినేషన్ చేయడం లేదని.. సరైన ఆహారం లేకపోవడంతో జనాలపై దాడులు చేస్తున్నాయని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థిపై దాడి చేయగా.. మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతి సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. గత నెలలోనూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిహార్ వలస దంపతుల ఆరేళ్ల కొడుకుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఆయా ఘటనలపై బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి బాధ్యత తీరిందని భావించొద్దని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అనుపమ్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

