TG EAPCET | రేపట్నుంచి టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం..
TG EAPCET | టీజీ ఎప్‌సెట్ ద్వారా తెలంగాణలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటించగా, ఈ నెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
TG EAPCET | హైదరాబాద్ : టీజీ ఎప్‌సెట్ ద్వారా తెలంగాణలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటించగా, ఈ నెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 4 నుంచి 12వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 6 నుంచి 13వ తేదీ మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 8 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 15న వెబ్ ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 19న సీట్ల కేటాయింపు జరగనుంది. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు జులై 19 నుంచి 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. తదితర వివరాల కోసం https://tgeapcet.nic.in/default.aspx అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
ఈ యేడు ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ కోటాలో చేపట్టనున్నారు. తుది విడుత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 9, 10తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్‌ను చేపడతారు. మూడు విడుతల కౌన్సెలింగ్‌లో ఒక కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థి అదే కాలేజీలో మరో బ్రాంచీలో సీటు ఖాళీగా ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ విధానంలో ఆయా సీటును ఎంపికచేసుకోవచ్చు. ఈ విధానంలో బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేది కాదు. కానిప్పుడు ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ కోటాలోనే చేపట్టనుండటంతో ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

