Bhadrachalam | మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా.. భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉద్రిక్తత
భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్ బంధువులు ఆందోళనకు దిగారు.
భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్ బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మృతదేహాలకు పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వ దవాఖాన మార్చురీ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుని తాపీమేస్త్రి ఉపేందర్, కార్మికుడు కామేశ్వర్రావు మృతిచెందారు. గురువారం శిథిలాల్లో చిక్కుకుపోయిన తాపీమేస్త్రి కామేశ్వర్‌రావును అధికారులు ప్రాణాలతో బయటకుతీశారు. కానీ అప్పటికే కాలు, చెయ్యి నుజ్జునుజ్జయి, తీవ్ర రక్తస్రావం జరిగిన కామేశ్వర్రావు దవాఖానకు తరలించిన వెంటనే ప్రాణాలు వదిలాడు. శుక్రవారం ఉదయం ఉపేందర్ మృతదేహాన్ని శిథిలాల కిందినుంచి రెస్క్యూ సిబ్బంది వెలికి తీసింది. పోస్టుమార్టం అనంతరం ఉపేందర్ డెడ్‌బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

