అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి భవన్‌కు తరలించారు.
నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో జగదీశ్ రెడ్డి కింద పడటంతో అతని కాలికి గాయమైంది. పోలీసుల తోపులాటలో కేటీఆర్ చేతికి, నుదిటికి గాయాలయ్యాయి. పోలీసులతో జరిగిన తోపులాటలో హరీశ్‌రావు కిందపడ్డారు. ఆ సమయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆయన చేతిని తొక్కారు. ఈ ఘటన అనంతరం నల్ల టీషర్టులతో అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో హరీశ్‌రావు టీషర్ట్ విప్పి బనియన్‌తో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
అసెంబ్లీ వద్ద కేటీఆర్ అరెస్ట్
అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసుల అభ్యంతరం
దీంతో కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/iLd26HGdHM pic.twitter.com/5staIrJlA1
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఇక రేవంత్ రెడ్డి పాలనలో అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారు. ఈ ఘటనతో ఆమె తీవ్రంగా కలత చెందారు. మహిళా సభ్యులతో ఇలాగేనా వ్యవహరించేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఆమెను ఓదార్చారు. అసెంబ్లీ సమావేశాల వేళ ఈ వరుస ఘటనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులతో తోపులాటలో కిందపడ్డ హరీష్ రావు
హరీష్ రావు చేతిని తొక్కి అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు
నలుపు రంగు దుస్తులతో అసెంబ్లీకి, శాసన మండలికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/mCFRw3CbdE pic.twitter.com/JRoujq550Q
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026