Nagarjuna sagar Dam | నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ అధికారుల దౌర్జన్యం.. 13వ గేటు వరకు ఆక్రమించి బారికేడ్ల ఏర్పాటు
Nagarjuna sagar Dam | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
Nagarjuna sagar Dam | నందికొండ, నవంబర్ 30: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడిచేశారు.
డ్యామ్ సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. డ్యామ్ 13వ గేట్ వరకు డ్యామ్ తమదని, అక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసి వేశారు. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. డ్యామ్‌పై విధులు నిర్వహించే సిబ్బంది 13వ గేట్ దాటి అటువైపు ఉన్న తెలంగాణ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లలేకపోయారు. తెలంగాణ పోలీస్ అధికారులు వచ్చి పరిస్థితిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యామ్ పైన ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా డ్యామ్ నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. ఆంధ్రా సర్కారుకు ఆ బాధ్యత లేదు. కృష్ణా రివర్ బోర్డు సూచించిన నీటి వాటాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు డ్యామ్‌లోని నీటిని వినియోగించుకుంటాయి. ఈ నీటి వినియోగం విషయంలో పలుమార్లు ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి.
కుడికాల్వకు అక్రమంగా నీటి విడుదల
డ్యామ్ 13వ గేట్ వరకు తమదని ఏపీ ఇరిగేషన్ అధికారులు అక్కడ ముళ్ల కంచె, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం జల విద్యుత్తు కేంద్రం ద్వారా కుడి కాల్వకు నీటి విడుదలను చేసుకున్నారు. నీటి విడుదల, డ్యామ్‌పైన నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఎన్నెస్పీ అధికారులు ఉన్నతాధికారులకు, కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఉద్రిక్తతను తగ్గించడానికి తెలంగాణ అధికారులు డ్యామ్ వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలోనైనా ఏపీ అధికారులు, పోలీసు బలగాలను తిప్పి పంపడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

