నిమ్స్‌కు పది వెంటిలేటర్లు

- సీఎస్ఆర్ కింద ట్రాన్స్‌కో, జెన్కో అందజేత
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ట్రాన్స్‌కో, జెన్కో పది వెంటిలేటర్లను అందించాయి. ఇందుకు అవసరమైన రూ. 70 లక్షల చెక్‌ను నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేందర్‌కు శనివారం సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో డైరెక్టర్ అజయ్, ఎస్ఈ టెక్నికల్ ఈగ హనుమాన్ అందించారు. వారం క్రితం నిమ్స్‌లో 500 ప్రత్యేక పడకలు ఏర్పాటుచేశామని దవాఖాన డైరెక్టర్ డాక్టర్ కే మనోహర్ తెలిపారు. వీటికి అదనంగా పది వెంటిలేటర్లు అవసరమయ్యాయని, ఈ విషయాన్ని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రూ.70 లక్షలు అందించారని పేర్కొంటూ.. ప్రభాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో వారం, పది రోజుల్లో వెంటిలేటర్లను కొనుగోలుచేసి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ చేతులమీదుగానే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
తొందరలోనే సిబ్బందికి వ్యాక్సినేషన్: సీఎండీ
కరోనా కట్టడికి వైద్యులు నిరంతరం కృషిచేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. వారి సేవలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన నిమ్స్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండోదశలో సుమారు మూడు వేల మంది విద్యుత్తు సిబ్బంది కరోనా బారిన పడ్డారని, తొందరలోనే సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

