నేడే సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత
Partial Solar Eclipse | ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే
హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతోపాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది.
-యాదాద్రి ఆలయాన్ని ఇవాళ ఉదయం 8:50 నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. నేడు జరిగే నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు నిర్వహించాల్సిన శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
-భద్రాద్రి రామాలయాన్ని ఇవాళ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు.
-వేములవాడలో రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సుప్రభాత సేవ తర్వాత రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
-జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం తిరుమంజనం నిర్వహించి, భక్తులకు సర్వ దర్శనానికి అనుమతిస్తారు.
-ధర్మపురి ఆలయాన్ని నిత్యారాధన, నివేదన అనంతరం మూసివేయనున్నారు.
-అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు.
-వరంగల్‌లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో వేయి స్తంభాల గుడిని ఉదయం 9 గంటలకే మూసివేయనున్నారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.
-తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
– ఇవాళ ఉదయం 11 గంటలకు కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని తెరవనున్నారు. రేపు ఆలయంలో అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
-విశాఖ సింహాచలం, శ్రీకాకుళం అరసవల్లి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AP Temples
- Hyderabad
- India
- Moon
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

