పక్కాగా ఆధారాల సేకరణ

- ఆక్రమణదారుల సమాచారం లభ్యం!
- ఆలయ భూముల వ్యవహారంలో
- అన్ని కోణాల్లో ప్రత్యేక కమిటీ విచారణ
మేడ్చల్, మే 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని ఆలయ భూముల వ్యవహారంలో ఐఏఎస్‌ల ప్రత్యేక విచారణ కమిటీ పక్కాగా ఆధారాలను సేకరించినట్టు తెలుస్తున్న ది. శ్రీసీతారామస్వామి ఆలయ భూ ములపై ఆధారాల సేకరణకు వివిధ విభాగాల అధికారులను కమిటీ ఇప్పటికే విచారించింది. ఆక్రమణదారుల గుర్తింపునకు ఆధారాలు లభించినట్టు సమాచారం. అనుమతుల్లేకుండా ఆల య భూముల్లో అక్రమంగా 160 గోదాములు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ నిర్మాణాలకు ఏ ప్రాతిపదికన అనుమతి పొందిన విషయాలను పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, మున్సిపల్, విద్యుత్తు అధికారుల నుంచి రాబట్టారు. దేవాదాయశాఖ రికార్డులను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై చేయించిన సర్వే ఆధారంగా సర్వే నంబర్లను నిర్ధారించుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు నేతృత్వంలో ప్రత్యేక విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి ఈటలపై వచ్చిన ఆరోపణల మేరకు దేవాదాయ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కాకతీయలు కాలంలో ఆలయ నిర్మాణం
కాకతీయుల కాలంలో లేదా 500 ఏండ్ల కిందట దేవరయాంజాల్‌లో శ్రీసీతారామస్వామి దేవాలయం నిర్మించినట్టు దేవరయాంజాల్ ప్రజలు చెప్తున్నారు. 1925లో నిజాం నవాబుల వద్ద ఇంజినీర్‌గా పనిచేసిన రామిడి పుల్లయ్యకు నిజాంలు సీతారామస్వామి పేరిట 91 సర్వే నంబర్లలో 1.525 ఎకరాల భూమి కేటాయించారు. ఆ భూమి పహాణీలో 1925, 26 సంవత్సరంలో శ్రీసీతారామస్వామి పేరిటే ఉన్నది. ఆ తర్వాత రికార్డులు లేకపోగా.. 1955, 56 సంవత్సరంలో రికార్డులు తారుమారు అయ్యాయి. సీతారామస్వామి పేరిట ఉన్న భూమి సీతారాంరెడ్డి పేరిట పహాణీలో నమోదైంది. ఇందులో దేవాదాయ భూములని ఉన్నప్పటికీ సీతారాంరెడ్డి పేరిట ఉన్న భూములకు సంబంధించి ఆ తర్వాత మరిన్ని పేర్లు పహాణీలో చేరాయి. అవి ఆలయ భూములేనని, రికార్డులు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

