Revanth Reddy | కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రివర్గం కూర్పుపై చర్చ
Revanth Reddy | తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో ఆయన సమావేశమయ్యారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించిన నేపథ్యంలో వారికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేపు (గురువారం) హైదరాబాద్‌లో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు.
అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలపై కూడా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో చర్చించారు. గురువారం రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

