వేములవాడకు శివరాత్రి శోభ

- నేటినుంచి మూడు రోజులపాటు జాతర
- నాలుగు లక్షల మంది వస్తారని అంచనా
కరీంనగర్ మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహా శివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న జాతరకు అధికార యంత్రాగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయంతోపాటు పట్టణంలో విద్యుత్ దీపాలు అలంకరించడంతో వేములవాడ వెలుగులమయమైంది. జాతరకు నాలుగు లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3.5 లక్షలకుపైగా వచ్చారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌తోపాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాజన్నను దర్శించుకున్న అనంతరం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

