స్టార్టప్‌లో తెలంగాణ ర్యాం‘కింగ్’
జాతీయ స్థాయిలో తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్-2021లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రంగా అవతరించింది. డిపార్డుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), స్టార్టప్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ క్యాటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో నెగ్గి
టాప్ పెర్ఫార్మర్గా ఎంపికైన తెలంగాణ
ఢిల్లీలో అవార్డు అందుకొన్న రాష్ట్ర ప్రతినిధులు
అవార్డు అందజేసి, ప్రశంసించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
స్టార్టప్ ర్యాంకింగ్-2021 విడుదల
స్థిరమైన అభివృద్ధికి తెలంగాణ బాటలు
ఆవిష్కరణలు, పరిధోనలకు రిచ్ తోడ్పాటు
మరో 4 అంశాల్లో జాతీయ గుర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్-2021లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రంగా అవతరించింది. డిపార్డుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), స్టార్టప్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ క్యాటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో నెగ్గి, తెలంగాణ ఈ అవార్డును కైవసం చేసుకొన్నది. సోమవారం ఢిల్లీలో స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్-2021 జాబితాను విడుదల చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఈ అవార్డును తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి శాంత తౌటంకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడుతూ.. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలోనూ, అధునాతన ఎకోసిస్టమ్‌ను నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నదని ప్రశంసించారు.
తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ (రిచ్) పేరుతో ఇంక్యుబేటర్‌ను ప్రారంభించడమే కాకుండా అనేక కార్యక్రమాలను చేపట్టిందని కొనియాడారు. సరికొత్త ఆవిష్కరణలకు ఇలాంటి అనుకూలమైన వ్యవస్థలు ఎంతో అవసరమని చెప్పారు. తెలంగాణ ఇన్నోవేషన్ ఫండ్ (టీ ఫండ్)ను ఏర్పాటుచేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పెట్టుబడిదారుల సహకారంతో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకొంటున్నదని మెచ్చుకొన్నారు. ఇలాంటి చర్యలు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో సమగ్ర, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి మూల కారకాలుగా పనిచేస్తున్నాయని పీయూష్ గోయల్ కీర్తించారు.
అవార్డు అందుకొన్న సందర్భంగా శాంత తౌటం మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పటివరకు 3 వేల స్టార్టప్‌ల నెట్‌వర్క్‌తో ఒక తయారీ కేంద్రంగా మారిందని వివరించారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ నివేదికలో పనితీరు విభాగంలో 4వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మూడు స్టార్టప్‌లు నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2020ను గెలుచుకున్నాయని చెప్పారు. టాప్ పెర్ఫార్మర్ అవార్డుతో పాటు ఇన్స్టిట్యూషనల్ చాంపియన్, ఇన్నోవేటివ్ లీడర్, ఇంక్యుబేషన్ హబ్, కెపాసిటీ బిల్డింగ్ పయనీర్ అంశాల్లోనూ జాతీయ స్థాయిలో స్థానం దక్కిందని తెలిపారు. టాప్ పెర్ఫార్మర్ క్యాటగిరీలో తెలంగాణతో పాటు కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్ము-కశ్మీర్ అత్యున్నత పనితీరును కనబరుస్తున్న రాష్ర్టాలుగా గుర్తింపుపొందాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

