చదువుల అమ్మలు… బోధనా వృత్తిలో తెలంగాణ మహిళల హవా

- అన్ని స్థాయిల్లో పురుషులకన్నా మహిళలే ముందు
- విద్యార్థి-టీచర్ నిష్పత్తి జాతీయ స్థాయికన్నా బెస్ట్
- ఎన్రోల్మెంట్లో మెరుగు.. డ్రాపౌట్లు తక్కువ
- కేంద్రం విడుదలచేసిన యూడైస్ నివేదికలో వెల్లడి
రాష్ట్రంలో మొత్తం టీచర్లు 3,05,597
మహిళా టీచర్లు 1,73,926
రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో మహిళా టీచర్లు దూసుకుపోతున్నారు. పాఠశాలల్లో పురుషులకంటే మహిళా టీచర్లే అధికంగా సేవలందిస్తున్నారు. భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దే బృహత్ కార్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. కేంద్రప్రభుత్వం శుక్రవారం విడుదలచేసిన యూడైస్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యార్థి-టీచర్ రేషియోలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకంటే మెరుగ్గా ఉన్నదని పేర్కొంది.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పిల్లలకు అమ్మే తొలిగురువు. లోకాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని అందించేది అమ్మే. ఇలాంటి అమ్మలే ఇప్పుడు పాఠశాలల్లోనూ అక్షరాలు దిద్దిస్తున్నారు. భావి పౌరుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మహిళా టీచర్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. ఇప్పడు పురుషులకంటే మహిళా టీచర్లే అధికంగా ఉండటం విశేషం. రాష్ట్రంలోని అన్నిరకాల యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల్లో కలిపి 3,05,597 మంది టీచర్లు ఉండగా, 1,73,926 మంది మహిళా టీచర్లు ఉన్నారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2019-20 సంవత్సరానికి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆఫ్ ఎడ్యుకేషన్ (యూడైస్) నివేదికను కేంద్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణలో ప్రాథమిక విద్యనుంచి అన్ని స్థాయిల్లో మహిళా టీచర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. ప్రాథమిక విద్యలో ఏకంగా 90 శాతం మహిళా టీచర్లే ఉన్నారు. సెకండరీ స్కూళ్లల్లో పురుషులు, మహిళా టీచర్ల నిష్పత్తి సమానంగా ఉండగా, హయ్యర్ సెకండరీ స్కూళ్లల్లో పురుషులు అధికంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉన్నది. వాటిల్లో 81,747 మంది పురుషులు, 70,551 మంది మహిళా టీచర్లున్నారు. ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లలో మహిళా టీచర్లు అధికంగా ఉన్నారు.
విద్యార్థి-టీచర్ నిష్పత్తిలో మేటి
విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకంటే ముందువరుసలో నిలిచింది. అన్నిస్థాయిల్లోను జాతీయ సగటుతో పోల్చుకున్నా, విద్యాహక్కు చట్టంతో పోల్చినా టీచర్లు అధికంగా ఉండటం విశేషం. జాతీయంగా ప్రాథమిక స్థాయిలో 26.5%, ప్రాథమికోన్నతలో 18.5%, సెకండరీలో 18.5%, హయ్యర్ సెకండరీలో 26.1 శాతంగా ఉన్నది. ఏ స్థాయిలో తీసుకున్నా తెలంగాణలో తక్కువ విద్యార్థులకు ఎక్కువ టీచర్లతో ఉపాధ్యాయ నిష్పత్తి మెరుగ్గా ఉండటం గమనార్హం. స్కూళ్లలో విద్యార్థుల చేరిక (ఎన్రోల్మెంట్) విషయంలో కూడా జాతీయస్థాయికంటే తెలంగాణ మెరుగ్గా ఉన్నది. డ్రాపౌట్ రేటు అప్పర్ ప్రైమరీలో 0.4%, సెకండరీలో 12.3% చొప్పున నమోదయ్యింది. జాతీయంగా అన్నిస్థాయిలో డ్రాపౌట్రేట్ తెలంగాణకంటే అధికంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 95 శాతం స్కూళ్లకు విద్యుత్ సౌకర్యం ఉన్నది.
యూడైస్‌లోని మరికొన్ని కీలకాశాలు
- రాష్ట్రంలో మొత్తం 3,05,597 మంది టీచర్లలో 1,52,298 మంది ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తుండగా ఎయిడెడ్‌లో 4,006, ప్రైవేటులో 1,48,814 మంది, ఇతరత్రా యాజమాన్యాల్లో 479 మంది పనిచేస్తున్నారు.
- మొత్తం 42,575 స్కూళ్లలో 40,763 (95.74%) స్కూళ్లకు విద్యుత్తు సౌకర్యం.
- 40,708 స్కూళ్లకు తాగునీటి సౌకర్యం ఉండగా, వీటిలో 28,136 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి.
- 37,850 స్కూళ్లలో టాయ్లెట్లు ఉన్నాయి. వీటిలో 25,512 ప్రభుత్వ, 11,574 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి.
- 37,522 స్కూళ్లలో హ్యాండ్‌వాష్ సౌకర్యం ఉన్నది. వీటిలో 26,046 ప్రభుత్వ, 10,705 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి.
- 39,382 స్కూళ్లలో గ్రంథాలయాలున్నాయి. 28,095 ప్రభుత్వ, 10,578 ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు బుక్స్ అందుబాటులో ఉంచారు.
- 36,650 స్కూళ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో 27,502 ప్రభుత్వ, 8,507 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి.
- 15,388 స్కూళ్లలో కంప్యూటర్ సౌకర్యం ఉండగా, వీటిలో 7,179 ప్రభుత్వ, 7,971 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. మరో 8,859 స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యముండగా, వీటిలో 2,408 ప్రభుత్వ, 6,277 ప్రైవేటు స్కూళ్లున్నాయి.
స్కూళ్లు-టీచర్ల వివరాలు (అన్ని రకాల యాజమాన్యాలు)
స్థాయి -స్కూళ్లు -టీచర్లు
ప్రాథమిక పాఠశాలలు – 20,752 – 53,690
ప్రాథమికోన్నత పాఠశాలలు – 7,471 – 47,840
ఉన్నత పాఠశాలలు – 11,921 – 1,61,038
హయ్యర్ సెకండరీ స్కూళ్లు – 2,431 – 14,320
మొత్తం – 42,575 – 3,05,597
విద్యార్థుల ఎన్రోల్మెంట్
స్థాయి (తరగతి) నిష్పత్తి
ప్రాథమిక (1-5) 111.9
ప్రాథమికోన్నత (6-8) 97.4
ఎలిమెంటరీ (1-8) 106.3
సెకండరీ (9,10) 88.0
హయ్యర్ సెకండరీ (11, 12) 57.2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

