డయాబెటిక్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ వంటి దీర్ఘ వ్యాధులకు ప్రభుత్వం ఉచిత మందులు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాష్ట్రప్రభుత్వం ఔషధాల కిట్లను అందిస్తున్నది. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ రోగులకు నెలనెలా మందులు ఇస్తున్నది. నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కింద మందులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
- డయాబెటిక్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ రోగులకు కిట్స్
- 30 ఏండ్లు దాటిన కోటి 50 లక్షల మందికి స్క్రీనింగ్
- 18 లక్షమంది హైపర్‌టెన్షన్ రోగులు ఉన్నట్టు గుర్తింపు
- రాష్ట్రంలో 8 లక్షల మంది డయాబెటిక్ రోగులు..
- 2.3 లక్షల మందికి కిట్స్.. గ్రేటర్లో మూడో దశలో పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాష్ట్రప్రభుత్వం ఔషధాల కిట్లను అందిస్తున్నది. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ రోగులకు నెలనెలా మందులు ఇస్తున్నది. నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కింద మందులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 22 జిల్లాలో ఈ కిట్ల పంపిణీని వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి హైపర్‌టెన్షన్, షుగర్, క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కోటిన్నర మందికి స్క్రీనింగ్
ఎన్సీడీ కింద రాష్ట్రవ్యాప్తంగా హైపర్‌టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించాయి. ఇందులో అత్యధికంగా హైపర్‌టెన్షన్ బాధితులు ఉన్నట్టు తెలిపారు.
క్యాన్సర్ రోగులకు స్క్రీనింగ్
క్యాన్సర్ రోగుల్లో ప్రధానంగా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్స్పై దృష్టి సారించారు. ఈ మూడు రకాల క్యాన్సర్లపై ఎంఎన్‌జే దవాఖాన ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో స్కీనింగ్ సెంటర్ల ద్వారా ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ఎన్సీడీలో భాగంగా మందుల కిట్ అందజేస్తున్నారు.

22 జిల్లాల్లో మొదలైన మందుల పంపిణీ
ఎన్సీడీ మొదటి దశలో భాగంగా 22 జిల్లాల్లో డ్రగ్ కిట్స్ పంపిణీ మొదలు పెట్టారు. ఇప్పటివరకు 2.3 లక్షల మందికి కిట్స్ పంపిణీ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ జిల్లాల్లో 6.20 లక్షల మంది రోగులు రిజస్టర్ చేసుకొన్నారు. మిగిలిన 11 జిల్లాల్లో 8.80 లక్షల మంది రోగులు ఉన్నట్టు అంచనా. త్వరలోనే ఆ జిల్లాల్లో కూడా డ్రగ్ కిట్స్ పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఫేజ్-3లో గ్రేటర్‌కు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైపర్‌టెన్షన్, షుగర్, క్యాన్సర్‌కు సంబంధించి సుమారు లక్షన్నర మంది రోగులు ఉన్నట్టు పాత రికార్డుల ద్వారా తెలుస్తున్నది. త్వరలోనే గ్రేటర్ పరిధిలో ఈ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్సీడీ 3వ దశలో గ్రేటర్ పరిధిలోని రోగులకు మందుల కిట్స్‌ను పంపిణీ చేస్తారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

