Autonomous | తెలంగాణలో మూడు డిగ్రీ కాలేజీలకు కొత్తగా అటానమస్ హోదా
Autonomous | తెలంగాణలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్‌ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Autonomous | తెలంగాణలోని కొత్తగా మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్‌ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. గతేడాది రాష్ట్రంలోని 11 డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదాను పొందాయి. కొత్తగా మూడు కాలేజీలతో అటానమస్ హోదా దక్కించుకున్న కాలేజీల సంఖ్య మొత్తం 14 చేరింది.
అటానమస్ హోదా విషయంలో యూజీసీ కొంతకాలం కిందట పలు మార్పులు చేసింది. వర్సిటీలతో సంబంధం లేకుండా నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసేలా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలేజీని ఏర్పాటు చేసి పది సంవత్సరాలై ఉండి, న్యాక్-ఏ గ్రేడ్ పొందితే ఆయా కాలేజీకి అటానమస్ హోదాను కల్పించనున్నది. తొలుత పదేండ్ల పాటు అటానమస్ హోదా ఇవ్వనుండగా.. 15 ఏండ్ల పాటు అటానమస్ హోదా కలిగి ఉంటే శాశ్వత అటానమస్ హోదాను ఇవ్వనున్నారు.
న్యాక్-ఏ గ్రేడ్ లేని కాలేజీల్లో కనీసం మూడు బ్రాంచీలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ ఉన్నా హోదా ఇస్తారు. రాష్ట్రంలోని అటానమస్ హోదా కలిగిన కోఠి మహిళా డిగ్రీ కాలేజీ రెండేండ్ల క్రితం వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల్లోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా, పీజీ సీట్లను సీపీగెట్ ద్వారా భర్తీ చేస్తుండగా.. ఆయా సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్ సమయంలో సంబంధిత కాలేజీలు పొందిన న్యాక్ గ్రేడ్ వివరాలను అదనంగా చేరుస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

