‘ఆటోమోడ్’కు స్వస్తి!
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న వేళ థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. సాంకేతిక పురోగతికి దూరంగా నడుస్తున్నాయి. కేసీఆర్ పాలనలో ఆటోమోడ్లో నడిచిన ఈ ప్లాంట్లు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మాన్యువల్ మోడ్‌కు మారిపోయాయి. గత రెండున్నరేండ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నది. రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో ఐదు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి.
- మాన్యువల్ మోడ్‌లో థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు
- గత రెండున్నరేండ్లుగాఇదే తంతు.. బొగ్గు వృథా
- పరికరాలపై ఒత్తిడి అధికం..ట్రిప్పింగ్ ముప్పు
- విద్యుత్తు రంగంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న వేళ థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. సాంకేతిక పురోగతికి దూరంగా నడుస్తున్నాయి. కేసీఆర్ పాలనలో ఆటోమోడ్లో నడిచిన ఈ ప్లాంట్లు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మాన్యువల్ మోడ్‌కు మారిపోయాయి. గత రెండున్నరేండ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నది. రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో ఐదు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆటోమోడ్లో నడిచే సామర్థ్యం కలిగినవే. కేసీఆర్ హయాంలో జెన్కో ఈ ప్లాంట్లను ఆటోమోడ్లో నడిపింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఈ ప్లాంట్లను మాన్యువల్ మోడ్‌లో నడుపుతున్నది. విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ సర్కార్‌కు ఏ మాత్రం శ్రద్ధ ఉన్నదో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఆటోమోడ్ అంటే..
థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు స్వయంచాలకంగా వాటంతట అవే నడవటాన్ని ఆటోమోడ్ అంటారు. ఇది ప్లాంట్ భద్రతను, విద్యుత్తు ఉత్పత్తిని స్వయంచాలకంగా నియంత్రించడానికి ఉపయోగపడే నవీన సాంకేతికత. ఈ విధానంలో ప్లాంట్‌లోని వాల్వ్‌లు, పంప్, మోటర్లను మనుషులు బటన్ల ద్వారా నియంత్రించరు. సెన్సర్ల ద్వారా సేకరించిన డాటా ఆధారంగా స్వయంచాలకంగా సర్దుబాటు చేయడమే ఆటోమోడ్ ప్రత్యేకత. ఈ విధానంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీని బట్టి బాయిలర్, టర్బైన్లు స్పందిస్తాయి. ఎంత బొగ్గు కావాలో అంతే తీసుకుంటాయి. ఎంత విద్యుత్తు అవసరమో అంతే ఉత్పత్తి చేస్తాయి.
ఎలా పనిచేస్తుందంటే..
ఉదయం వేళల్లో ఆఫీసులు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఒకేసారి తెరుచుకున్నప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆన్ అవుతాయి. అప్పుడు గ్రిడ్‌పై లోడ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఆటోమోడ్లో ఉన్న థర్మల్ ప్లాంట్ ఈ లోడ్‌ను తక్షణమే గుర్తించి బాయిలర్‌కు కావాల్సిన బొగ్గు, గాలి, స్టీమ్ మోతాదులను దానంతటదే పెంచుతుంది. టర్బైన్వాల్వ్లను అవసరానికి తగినట్టు ఓపెన్, క్లోజ్ చేస్తూ ఫ్రీక్వెన్సీని సమతుల్యం చేస్తుంది. సాయంత్రం పూట విద్యుత్తు వినియోగం తగ్గగానే ప్లాంట్‌లో బొగ్గు, స్టీమ్ మోతాదులతోపాటు విద్యుత్తు ఉత్పత్తి ఆటోమెటిక్‌గా తగ్గుతుంది.
మాన్యువల్ మోడ్‌తో నష్టాలే
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నందున థర్మల్ ప్లాంట్లను నిరంతరం మాన్యువల్ మోడ్‌లో నడపడం శ్రేయస్కరం కాదని, మాన్యవల్ మోడ్‌తో నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాన్యువల్ మోడ్ వల్ల ప్లాంట్‌పై అనవసరమైన ఒత్తిడి పెరిగుతుందని, అనుకోకుండా ట్రిప్పింగ్ అయ్యే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ఈ విధానంలో బొగ్గు అధిక మొత్తంలో వృథా అవుతుందని, కాలుష్యం, ఉద్గారాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. పారామీటర్లు పెరిగితే పరికరాల అరుగుదల పెరుగుతుందని, బాయిలర్‌కు ట్రిప్పింగ్ ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్లలోని సెన్సర్లు, కంట్రోల్ లూప్‌లను సరిచేయడంతోపాటు ప్లాంట్లను ఆటోమోడ్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

