భద్రతాసౌధం.. తెలంగాణ ఇక భద్రం
ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాసౌధం ఆవిష్కృతం కానున్నది. విదేశాల్లో ఈ తరహా సీసీసీలు ఉన్నప్పటికీ అక్కడ శాంతి భద్రతల నిర్వహణ
- శాంతిభద్రతల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ
- అన్ని శాఖల సమన్వయాల సమాహారం
- ప్రపంచంలో అన్నీ ఒకచోట కేంద్రీకృతమైన ఏకైక సెంటర్
- విదేశాలతో పోలిస్తే సీసీసీలో అనేక ప్రత్యేకతలు, సదుపాయాలు
- యావత్ దేశానికి తెలంగాణ పోలీస్ రోల్‌మాడల్
- జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కెమెరాలు అనుసంధానం
- ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రోస్టేషన్ల కెమెరాలు సీసీసీతో లింక్
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాసౌధం ఆవిష్కృతం కానున్నది. విదేశాల్లో ఈ తరహా సీసీసీలు ఉన్నప్పటికీ అక్కడ శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణకు సంబంధించిన సెంటర్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకేచోట కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఫ్యూజిన్ సెంటర్లు, ఇతర బ్యాక్ ఎండ్ పోలీస్ దర్యాప్తు, సాంకేతిక అంశాల సమాహారంగా ఉన్న ఏకైక సీసీసీ హైదరాబాద్‌లోనే నిర్మాణమైంది.
ఇతర దేశాల్లో ఒక్కొక్కటి ఒక్కో చోట
అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో నగరాల్లో సీసీ సెంటర్లు ఉన్నాయి. మల్టీ ఏజెన్సీ సెంటర్, రియల్‌టైం క్రైం అనాలసిస్ సెంటర్, ట్రాఫిక్ సంబంధించినవి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో ట్రాఫిక్ కో-ఆర్డినేషన్, శాంతిభద్రతల నిర్వహణకు వేర్వేరుగా ఉన్నాయి. ఇంగ్లండ్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ ఉన్నది. కొరియాలో పోలీస్ ఆపరేషన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, శాంతిభద్రతలకోసం వేర్వేరుగా వ్యవస్థలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మన దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మాత్రం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఫ్యూజిన్ సెంటర్లు, పోలీస్ విధుల్లో బ్యాక్ఎండ్లో ఆపరేషన్స్‌కు సంబంధించిన టెక్నాలజీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, విపత్తుల సమయంలో ఆపరేషన్స్‌కు సంబంధించిన నిర్వహణ, పోలీస్‌తోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులంతా ఒకే చోట నుంచి సమన్వయం చేసుకోవడం సహా రాష్ట్ర పూర్తి యంత్రాగం ఒకే ఆవరణ నుంచి పనిచేసేలా రూపుదిద్దుకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల అనుసంధానం
రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే హైదరాబాద్ నగరంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించవచ్చు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించారు. అక్కడి నుంచి ఫీడ్‌ను నేరుగా సీసీసీ జోడించారు. హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సైతం సీసీసీతో అనుసంధానించినట్టు అధికారులు తెలిపారు. 20 అంతస్తులున్న టవర్ ఏ లోని 18 వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది.
సీసీసీ వివరాలు
సీసీసీని ట్విన్ టవర్ల కాన్సెప్ట్‌లో రూపకల్పన చేశారు. రెండు అత్యాధునిక అద్దాల సౌధాలు అద్భుతంగా నిర్మించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

