Chandrababu | కాళేశ్వరం కడితే మేం అడ్డుకున్నామా.. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu | తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివాదాస్పదమైన బనకచర్ల పథకాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సభలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టుకుంటే మేం అడ్డుకున్నామా?
Chandrababu | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ): తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివాదాస్పదమైన బనకచర్ల పథకాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సభలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టుకుంటే మేం అడ్డుకున్నామా? గోదావరి వృథాజలాల ఆధారంగా బనకచర్ల కట్టుకుంటే తప్పేమిటి?’ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. జలరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అసలు గోదావరి బేసిన్లో ఉన్నవి మిగులు జలాలేనని, వరదజలాలు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో గోదావరి ట్రిబ్యునల్ చెప్పిన విషయాలను ఉటంకిస్తున్నారు.
కానీ, చంద్రబాబు మాత్రం ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ బనకచర్లపై ముందుకెళ్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ఒకవేళ, ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జలరంగ, న్యాయ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించి పర్మిషన్ వచ్చిన తర్వాతే ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. కేటాయింపులేని వరద జలాలను సాకుగా చూపి మన నీళ్లను తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కట్టుకుంటే తాము అడ్డుకోలేదంటూ అక్కసు వెళ్లగక్కారని తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. చంద్రబాబు కుట్రలపై తెలంగాణ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పొతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు నీళ ్లకోసం అల్లాడే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

