Departmental tests | ఈ నెల 15 నుంచి డిపార్టుమెంటల్ పరీక్షలు.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ
Departmental tests | ఈ ఏడాది మే నెల (2023 మే) సెషన్‌కు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ నెల 15 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు TSPSC ఒక ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసింది.
హైదరాబాద్: ఈ ఏడాది మే నెల (2023 మే) సెషన్‌కు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ నెల 15 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు TSPSC ఒక ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ నెల 15 నుంచి 24 వరకు పరీక్షలు జరుగుతాయని TSPSC తన ప్రకటనలో పేర్కొన్నది.
సర్వే, లాంగ్వేజ్ పరీక్షలు మినహా మిగతా పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT) విధానంలో, ఆ రెండు పరీక్షలు మాత్రం డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయని TSPSC స్పష్టంచేసింది. HMDA పరిధిలోని రంగారెడ్డి జిల్లాతో కూడిన హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 9 జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి TSPSC అధికారిక వెబ్సైట్ (www.tspsc.gov.in) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పత్రికా ప్రకటనలో టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల అనంతరం కూడా ఈ హాల్ టికెట్లను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో డూప్లికేట్ హాల్‌టికెట్లను జారీచేయబోమని తెలిపింది.
హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడంలో ఏమైనా సమస్యలు ఉంటే అభ్యర్థులు 040-22445566 ల్యాండ్‌లైన్ నెంబర్ ద్వారా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
Horoscope | 11-11-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

