పెట్టుబడుల ఆకర్షణలో జోరే కారణం
త్రైమాసిక నివేదికలో ట్రాక్షన్ జియో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ ఎకోసిస్టంను అభివృద్ధి చేయడంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న టీహబ్ మరో ఘనత సాధించింది.
పెట్టుబడులను ఆకర్షించడంలో జోరుగు ముందుకు సాగుతున్న టీహబ్.. ప్రపంచంలోని ‘మోస్ట్ యాక్టివ్ ఇన్వెస్టర్స్-యాక్సిలరేటర్స్, ఇంక్యుబేటర్స్’లో ఐదో స్థానంలో నిలిచినట్టు 2022 త్రైమాసిక నివేదికలో ట్రాక్షన్ జియో స్పష్టం చేసింది. ఇప్పటివరకు వివిధ కంపెనీల నుంచి 935 స్టార్టప్‌లకు పెట్టుబడులను రాబట్టడం ద్వారా టీహబ్ ఈ స్థానాన్ని కైవసం చేసుకొన్నట్టు వెల్లడించింది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన డార్విన్‌బాక్స్ స్టార్టప్ యూనికార్న్ కంపెనీల జాబితాలో చేరినట్టు ట్రాక్షన్ పేర్కొన్నది.