పచ్చదనం పరిచిన తెలంగాణ.. రెండేండ్లలో 334 చ.కి.మీ.పెరిగిన గ్రీనరీ
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దేశంలో ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి ఎగబాకింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 632 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.
- 632 చ.కి.మీ.అటవీ విస్తీర్ణం
- బీజేపీ రాష్ర్టాల్లో తగ్గుదల
- రోల్ మాడల్‌గా తెలంగాణ
- ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దేశంలో ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి ఎగబాకింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 632 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం ద్వారా మొక్కలు నాటడంపై, వాటి మనుగడపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఫలితంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగి, పచ్చదనం పరిఢవిల్లింది.
చెట్ల విస్తీర్ణం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అటవీ పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో రెండేండ్లలో 334 చదరపు కిలోమీటర్ల మేర చెట్ల విస్తీర్ణం పెరిగింది. గుజరాత్లో 1,423 చదరపు కిలోమీటర్లు, మధ్యప్రదేశ్‌లో 285 చదరపు కిలోమీటర్ల మేర చెట్ల విస్తీర్ణం తగ్గింది. ఇదీ బీజేపీ పాలిత రాష్ట్రాలు పచ్చదనం పట్ల చూపిస్తున్న నిబద్ధత. ఈనెల 19న విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హ్యాండ్ బుక్202122లో పచ్చదనం, అటవీ విస్తీర్ణంలో తెలంగాణ సాధించిన విజయాలను వెల్లడించిం ది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 2015లో 19,854 చదరపు కిలోమీటర్ల నుంచి 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హరితహారం ద్వారా 2022 జనవరి వరకు 230 కోట్ల మొకలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 235.59 (102.6 శాతం) కోట్ల మొకలు నాటారు. చెట్ల విస్తీర్ణం 2015లో 2,549 చదరపు కిలోమీటర్ల నుంచి 2021 నాటికి 2,848 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
అడవులు,చెట్ల విస్తీర్ణాన్ని పెంచడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మాడల్‌గా నిలిచింది.తెలంగాణ ప్రభుత్వం 2015-16లో హరితహారం ప్రారంభించే నాటికి 19,854 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉన్నది. అప్పటినుంచి హరితహారాన్ని సమర్థవంతంగా అమలు చేయ డం, నాటిన మొకలకు నీరుపోయడం, నిర్వహించడం వంటి కార్యక్రమాలతో అటవీ విస్తీర్ణం లో స్థిరమైన పెరుగుదల సాధ్యమైంది. 2017లో 20,419 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అటవీ విస్తీర్ణం 2019 నాటికి 20,582 చదరపు కిలోమీటర్లకు పెరిగి, 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు చేరుకొన్నది. 2015లో 2,549 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చెట్ల సాంద్రత 2017లో 2,669 చదరపు కిలోమీటర్లకు, 2019లో 2,514 చదరపు కిలోమీటర్లకు, 2021లో 2,848 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

