సీనియర్లకే గురుకుల బాధ్యతలు
ఎస్సీ గురుకుల సొసైటీ ఎట్టకేలకు కండ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో కదిలింది. గురుకుల పాఠశాలలు, కాలేజీల ప్రిన్సిపాళ్లుగా సీనియర్లను నియమించాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది.
- ఎస్సీ గురుకుల సొసైటీ ఉత్తర్వులు
- ‘నమస్తే’ కథనానికి స్పందన
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ ఎట్టకేలకు కండ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో కదిలింది. గురుకుల పాఠశాలలు, కాలేజీల ప్రిన్సిపాళ్లుగా సీనియర్లను నియమించాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని జోనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేసింది. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గురుకులంలో దాదాపు 150 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ ప్రిన్సిపాళ్లను నియమించకుండా తాత్సారం చేస్తున్నది.
ప్రిన్సిపాళ్లుగా జూనియర్లకు బాధ్యతలు అప్పగించి, సుదీర్ఘకాలంగా నెట్టుకొస్తున్నది. గురుకుల పాలన గాడితప్పుతున్నది. మరోవైపు పర్యవేక్షణలోపం అంటూ సదరు ఇన్చార్జులనే బలి చేస్తున్నది. ఇదే విషయమై ‘తప్పు సర్కారుదీ.. శిక్ష సిబ్బందికి’ పేరిట ఇటీవల కథనం ప్రచురించింది. దీనిపై ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ స్పందిస్తూ గురుకుల ప్రిన్సిపాళ్లుగా ఇకపై సీనియర్లనే నియమించాలని ఉత్తర్వులు జారీచేశారు. ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ పొందినా, సెలవుపై వెళ్లినా తక్షణం అక్కడే సీనియర్‌గా ఉన్న జేఎల్, లేదంటే పీజీటీ, ఆ తరువాత టీజీటీని నియమించాలని సూచించారు.
సీనియర్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతల స్వీకరణకు నిరాకరిస్తే, ఆ విషయాన్ని రాతపూర్వకంగా తీసుకోవాలని, ప్రమోషన్ల సర్వీస్ బుక్‌లోనూ ఎంట్రీ చేయాలని స్పష్టంచేశారు. ఆ దిశగా జోనల్ ఆఫీసర్లు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మళ్లీ ఇన్చార్జీలను నియమించడమేందని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రమోషన్ల ప్రక్రియను చేపడితే ఇన్చార్జుల పాలన తప్పుతుందని, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

