Telangana | పదేండ్ల కేసీఆర్ పాలన.. తెలంగాణ అగ్రపథాన
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పాలనను రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్ సర్కారే ఈ విషయాలను వెల్లడించింది.
- రాష్ర్టావిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి
- వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కారు గణాంకాలు
- దశాబ్ది ప్రగతికి అద్దంపట్టిన రాష్ట్ర గణాంక నివేదిక-2024
- జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో నంబర్వన్
- పదేండ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాలు సాగులోకి
- బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ
- కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాపౌట్లు
- తెర్లమర్లయిన తీరును వెల్లడించిన గణాంక నివేదిక
2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ
2023-24లో 196.9 శాతం వృద్ధితో రూ. 15,01,981 కోట్లుగా నమోదైంది.
అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి మాత్రం 136.89 శాతంగానే ఉన్నది.
2023-24లో దేశ తలసరి ఆదాయం రూ.1,84,205 ఉండగా, తెలంగాణలో రూ. 3,56,564తో నాన్ స్పెషల్ క్యాటగిరీ(ఎన్ఎస్సీ) రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది.
2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68.17లక్షల టన్నులు ఉండగా, 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది.
2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ) : పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పాలనను రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్ సర్కారే ఈ విషయాలను వెల్లడించింది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024(అట్లాస్) పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి అక్షరసాక్ష్యంగా నిలిచింది. వివిధ రంగాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొందుపరుస్తూ రూపొందించిన ఈ నివేదిక బీఆర్ఎస్ హయాంలో సాధించిన రాష్ట్ర పురోగతికి అద్దం పట్టింది. కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళం వేసింది. వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చిచెప్పాయి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్(అట్లాస్) పుస్తకాన్ని డాక్టర్ బీఆర్ అంబేదర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆవిషరించారు.

అన్నపూర్ణలా మారిన తెలంగాణ
కేసీఆర్ అమలు చేసిన పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని పెంచిందని కాంగ్రెస్ సర్కారు ఈ నివేదికలో పేర్కొన్నది. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు పెట్టుబడి సాయం పథకం, రైతుబీమా పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసినట్టు వెల్లడించింది. ఈ పథకాల ఫలితంగా రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 155.7 శాతం పెరిగిందని, పంటల సాగు, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టుగా పేర్కొన్నది. బియ్యం ఉత్పత్తిలో 1.68 కోట్ల టన్నులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచినట్టు తెలిపింది.
ఆర్థిక ప్రగతిలో అగ్రభాగాన తెలంగాణ
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరిగిందని, దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ అధికంగా, వేగంగా వృద్ధిని నమోదు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్టు వెల్లడైంది. తెలంగాణ ఏర్పాటు తరువాత దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం దేశీయ స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)లో ప్రతిఏటా వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో తెలంగాణ జీఎస్డీపీ రూ.15, 01,981కోట్లతో 14.5 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిలో నాన్ స్పెషల్ క్యాటగిరీ రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్-1గా నిలిచినట్టు పేర్కొన్నది.
వ్యవసాయ రంగంపై కీలకాంశాలు
- 2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల టన్నులు ఉండగా, 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది.
- వరి సాగు 2014-15లో 34.97 లక్షల ఎకరాలు కాగా 2023-24లో 1.18 కోట్ల ఎకరాలకు పెరిగింది.
- 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.
- 2023-24లో రుణమాఫీ కింద 22.05 లక్ష ల మంది రైతులకు సంబంధించి రూ.17, 770 కోట్లను మాఫీ చేసినట్టు పేర్కొంది.
కేసీఆర్ పాలనలో ఆర్థిక వృద్ధి ఇలా..
2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2023-24లో 196.9 శాతం వృద్ధితో రూ. 15,01, 981కోట్లుగా నమోదైంది. అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి మాత్రం 136.89 శాతంగానే ఉంది.
తెలంగాణ ఏర్పాటు అనంతరం 12.9 శాతం సగటు జీఎస్డీపీ వృద్ధితో దేశ సగటు వృద్ధి రేటు 10.3 కన్నా 2.6 శాతం అధికంగా తెలంగాణలో నమోదైంది.
2014-15 నుంచి 2023-24 మధ్య తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 12.9శాతంతో అన్ని దక్షిణాది రాష్ర్టాలను అధిగమించింది.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1శాతం ఉండగా, 2023-24లో 5.1శాతానికి పెరిగింది.
జనాభాపరంగా చూస్తే దేశ జనాభా మొత్తంలో తెలంగాణలో 2.8 శాతమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో మాత్రం 5.1శాతం వాటాను సమకూర్చింది.
2023-24లో దేశ తలసరి ఆదాయం రూ.1,84,205 ఉండగా, తెలంగాణలో రూ. 3,56,564తో నాన్ స్పెషల్ కేటగిరీ(ఎన్ఎస్సీ) రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

