14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక
ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేందుకు 14 నెలల ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
- ఎల్ నినో నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత: ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేందుకు 14 నెలల ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాబోయే వ్యవసాయ సీజన్లో వర్షపాతం తగ్గినా రేషన్ సరఫరాలకు అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం నిల్వల నిర్వహణకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజనం తదితర అవసరాలకు కలిపి నెలకు సుమారు 2.38లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని బఫర్ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్), ఇతర గుర్తించిన సరఫరాల ద్వారా మరో 18.91లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందాల్సి ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

