హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : 2023 -24 విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు మరోసారి గడువు ఇస్తున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో https://www.telanganaopenschool.org దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.