దరఖాస్తు చేసుకుంటేనే ఓటు
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటరు జాబితా పునఃసిద్ధత కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రుల్లో ఓటు నమోదు ప్రక్రియపై వ్యక్తమవుతున్న సందేహాలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి సమాధాలు చెప్పారు. ఓటు నమోదుకు డిగ్రీ ఎప్పటిలోపు పూర్తిచేసి ఉండాలి? గతంలో ఓటు వేసినవారు మళ్లీ నమోదు చేసుకోవాలా?
- రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు
- నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
- గత ఏడాది డిగ్రీ చేసినవారు అర్హులేనా?
- ఇతర నియోజకవర్గాలవారూ దరఖాస్తు చేసుకోవచ్చా?
- ఓటర్ల సందేహాలకు సీఈవో సమాధానాలు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటరు జాబితా పునఃసిద్ధత కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రుల్లో ఓటు నమోదు ప్రక్రియపై వ్యక్తమవుతున్న సందేహాలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి సమాధాలు చెప్పారు. ఓటు నమోదుకు డిగ్రీ ఎప్పటిలోపు పూర్తిచేసి ఉండాలి? గతంలో ఓటు వేసినవారు మళ్లీ నమోదు చేసుకోవాలా? ఆధార్ తప్పనిసరా? కరీంనగర్లో నివసించే పట్టభద్రులు నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు నమోదు చేసుకోవచ్చా? దరఖాస్తుతో ఏ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి? వంటి ప్రశ్నలపై ‘నమస్తే తెలంగాణ’కు సీఈవో సవివరంగా సమాధానాలు ఇచ్చారు.
తెలంగాణలో ప్రస్తుతం మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటరు జాబితాలను రూపొందించే ప్రక్రియ చేపట్టినట్టు సీఈవో చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకు నమోదు చేసుకోవాలనే పట్టభద్రులు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. నవంబర్ 25న ముసాయిదా జాబితా ప్రచురిస్తామని చెప్పారు. పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకొని, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు.
ప్రశ్న: ఓటరు నమోదు ఎకడ చేయాలి? ఎవరిని సంప్రదించాలి?
సీఈవో: ఆన్లైన్ నమోదు కోసం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్సైట్ ceotelangana.nic.inలో ఆఫ్‌లైన్‌లో సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), సహాయ ఎన్నికల నమోదు అధికారి (ఏఈఆర్వో) లేదా నియమిత అధికారికి దరఖాస్తు అందజేయవచ్చు. పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు. సాధారణంగా జిల్లా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్స్థాయి అధికారులు ఈఆర్వోగా, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఏఈర్వోలుగా వ్యవహరిస్తారు. వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1950లో సంప్రదించవచ్చు.
ప్రశ్న: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఓటు నమోదు చేసుకోవచ్చు?
సీఈవో: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా ఎన్నికల నిబంధనల ప్రకారం సమానమైన అర్హత పొందినవారు, సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గంలో సాధారణ నివాసితులుగా ఉన్నవారు అర్హులు. ఈ ఎన్నికల కోసం నవంబర్ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించారు. అందువల్ల 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీతోపాటు ఉన్నత విద్యార్హతలు కలిగినవారూ అర్హులే. విద్యార్హత ఉండటం ఒకటే సరిపోదు. సంబంధిత నియోజకవర్గంలో నివాస అర్హత కూడా ఉండాలి.
ప్రశ్న: కరీంనగర్లో నివసించే పట్టభద్రులు నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు నమోదు చేసుకోవచ్చా?
సీఈవో: ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం కరీంనగర్లో నివసించే పట్టభద్రులు వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గానికి ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులు కారు. ఎందుకంటే కరీంనగర్ ప్రాంతం ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాలకే ఓటరు జాబితాలు రూపొందిస్తున్నారు.
ప్రశ్న: కరీంనగర్లో చదివినవారు, కానీ ప్రస్తుతం నల్లగొండలో నివసిస్తున్నవారు ఓటు నమోదు చేసుకోవచ్చా?
సీఈవో: చదువుకున్న ప్రాంతం ఒకటే నిర్ణయాత్మకం కాదు. సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసితుడిగా ఉండటం ముఖ్యం. కరీంనగర్లో డిగ్రీ చదివి, ప్రస్తుతం వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో సాధారణంగా నివసిస్తున్న వ్యక్తి, మిగిలిన విద్యార్హతలు నెరవేరిస్తే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నివాస అర్హతను సంబంధిత ఎన్నికల అధికారి పరిశీలిస్తారు.
ప్రశ్న: గతంలో ఓటరుగా నమోదు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాలా?
సీఈవో: అవును. తప్పనిసరిగా కొత్తగా నమోదు చేసుకోవాలి. గతంలో ఓటు వేసినవారైనా, గత ఎన్నికల ఓటరు జాబితాలో పేరు ఉన్నవారైనా ప్రస్తుత ప్రక్రియలో కొత్తగా ఫామ్-18 సమర్పించాలి. విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా మళ్లీ సమర్పించాలి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960లోని రూల్ 31 ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రతి ఎన్నికల సందర్భంలో కొత్త ఓటరు జాబితా రూపొందించే విధానం అమలులో ఉంటుంది.
ప్రశ్న: డిగ్రీ ఉత్తీర్ణత తేదీ ముఖ్యమా? కాన్వొకేషన్ తేదీని పరిగణనలోకి తీసుకుంటారా?
సీఈవో: ఉత్తీర్ణత తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు. కాన్వొకేషన్ తేదీకి ప్రాధాన్యం లేదు. మారుల మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్లో పేరొన్న ఉత్తీర్ణత తేదీ ఆధారంగా అర్హతను నిర్ధారిస్తారు. 2023 అక్టోబర్ 31న లేదా అంతకంటే ముందే డిగ్రీ ఉత్తీర్ణులైనవారు విద్యార్హతపరంగా అర్హులు. 2023 నవంబర్ 1న లేదా ఆ తర్వాత డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ ప్రక్రియకు అర్హులు కారు.
ప్రశ్న: ఓటరు నమోదు కోసం ఏ ఫామ్ ఉపయోగించాలి?
సీఈవో: పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదుకు నిర్దేశించిన ఫామ్-18 మాత్రమే ఉపయోగించాలి. తెల్లకాగితంపై దరఖాస్తు చేస్తే అంగీకరించరు. ఫామ్-18 ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు.
ప్రశ్న: ఫామ్-18తోపాటు ఏ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి?
సీఈవో: ప్రధానంగా విద్యార్హతకు సంబంధించిన పత్రం, అవసరమైన ఇతర ధ్రువీకరణలు సమర్పించాలి. నివాస వివరాలు, గుర్తింపు వివరాలను కూడా ఫామ్‌లో సరిగ్గా నమోదు చేయాలి. విద్యార్హతకు సంబంధించి డిగ్రీ సర్టిఫికెట్ కాపీ, అది అందుబాటులో లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికెట్, అవసరమైన సందర్భంలో డిగ్రీ ఉత్తీర్ణతను నిరూపించే మారుల మెమో సమర్పించాలి. ఫామ్- 18లో అడిగిన చిరునామా, సాధారణ నివాసానికి సంబంధించిన వివరాలు, ఫామ్‌లో కోరిన ఇతర సమాచారం, ఆధార్ వివరాలు ఇవ్వాలనుకుంటే అందించవచ్చు. అవి తప్పనిసరి కావు.
ప్రశ్న: డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే సరిపోతుందా? అసలు పత్రం చూపించాలా?
సీఈవో: ఎన్నికల సంఘం నియమాల ప్రకారం.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు అసలు డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా మారుల మెమోను సంబంధిత ఏఈఆర్వోకు లేదా నియమిత అధికారికి చూపించాలి. అధికారి అసలు పత్రాన్ని పరిశీలించి, దాని ప్రతిపై ధ్రువీకరణ నమోదు చేస్తారు. ‘ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్‌ను పరిశీలించాను అది సరైనదే’ అని రాసి, సంతకం, పేరు, అవసరమైన వివరాలు నమోదు చేస్తారు. అసలు సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లడం సాధ్యం కాకపోతే? జిల్లా గెజిటెడ్ అధికారి అసలు సర్టిఫికెట్‌ను స్వయంగా పరిశీలించి, కాపీ సరైనదని నిర్ధారించిన తర్వాత ధ్రువీకరించిన ఫొటోకాపీని సమర్పించవచ్చు.
ప్రశ్న: డిగ్రీ సర్టిఫికెట్ కాలేజీ లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఉంటే ఏం చేయాలి?
సీఈవో: అసలు సర్టిఫికెట్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆధారాలకు అవకాశం ఉన్నది. ప్రభుత్వ రికార్డుల్లో విద్యార్హత వివరాలు ఉంటే సంబంధిత కార్యాలయ అధిపతి ధ్రువీకరించిన కాపీ లేదా సర్టిఫికెట్, విశ్వవిద్యాలయంలో నమోదైన పట్టభద్రుల జాబితా, న్యాయవాదుల రోల్, వైద్యుల రిజిస్టర్ లేదా సంబంధిత వృత్తి సంస్థ రికార్డులో ధ్రువీకరించిన కాపీ, వర్సిటీ రిజిస్ట్రార్ లేదా అనుబంధ కళాశాల ప్రిన్సిపాల్/సంబంధిత విభాగాధిపతి ధ్రువీకరణతో కూడిన అఫిడవిట్. అసలు మా రుల మెమో లేదా నిర్దేశిత అధికారి, గెజిటెడ్ అధికారి లేదా నోటరీ ద్వారా అసలుతో సరిపోల్చి ధ్రువీకరించిన కాపీ సమర్పించవచ్చు.
ప్రశ్న: ఆధార్ నంబర్ తప్పనిసరా?
సీఈవో: లేదు. ఆధార్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదు. సవరించిన ఫామ్-18లో ఆధార్ వివరాలకు సంబంధించిన కాలమ్ ఉన్ననప్పటికీ, దరఖాస్తుదారుడు వాటిని అందించకపోయినంత మాత్రాన ఒత్తిడి చేయరాదు. ఆధార్ వివరాలు సమర్పిస్తే వాటిని బహిరంగంగా వెల్లడించకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రశ్న: ఓటరు కార్డు (ఎపిక్) నంబర్ లేకపోతే దరఖాస్తు తిరసరిస్తారా?
సీఈవో: లేదు. ఎపిక్ నంబర్ లేదనే ఒక కారణంతో దరఖాస్తును తిరసరించడానికి వీల్లేదేని మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి.
ప్రశ్న: ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి?
సీఈవో: ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే, న మోదు వివరాల్లో తప్పులున్నా లేదా ఇతర అభ్యంతరాలున్నా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించి డిసెంబర్ 25లోపు పరిషరిస్తారు. తుది ఓటరు జాబితాను డిసెంబర్ 30న ప్రచురిస్తారు.
ప్రశ్న: రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ ఓటు నమోదు చేసుకోవచ్చా?
సీఈవో: లేదు. ఒక వ్యక్తి ఒకే పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రమే నమోదు కావాలి. ఒకే నియోజకవర్గంలో రెండు వేర్వేరు చిరునామాల్లో రెండుసార్లు నమోదు చేసుకోవడానికి అనుమతి లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్లు 17, 18 ప్రకారం ఒకటి కంటే ఎకువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎకువసార్లు నమోదు చేయరాదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

